News

ప్రత్యేక హోదాలో సాయం కన్నా ఎక్కువే


కేంద్రం ఎపి పట్ల సానుకూలంగా ఉందని, ప్రత్యేక హోదాలో వచ్చే ఆర్ధిక సాయం కన్నా ఎక్కువే కేంద్రం నిదులు ఇస్తుందని  బిజేపి ప్రత్యేక హోదా పై రాద్దాంతం అవసరం లేదని నేత, ఎపి మంత్రి మాణిక్యాలరావు అన్నారు. విపక్షాలు అనవసరంగా రాధ్దాంతం చేస్తున్నాయని అన్నారు. ఆందోళనల పేరుతో హడావుడి చేస్తున్నాయని మాణిక్యాలరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని ఆందోళన చేస్తున్నది అర్దం కావడం లేదని మాణిక్యాలరావు విమర్శించారు. బిజెపి క్రమేపి అసలు విషయం చెప్పడానికి ముందుకు వస్తున్నట్లుగా ఉంది. విపక్షాలతో పాటు టిడిపి ఎమ్.పిలు కూడా ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసిన విషయాన్ని మంత్రి మరిచిపోతున్నట్లుగా ఉంది.